సారథిన్యూస్, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలను వనపర్తి జిల్లాకు తరలించడం సరికాదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ నేతలు బిజినేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ అంజిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. దాదాపు 540 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి, ఈశ్వర్, పాషా, బలమాసయ్య, మిద్దె సూరి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
- July 8, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CONGRESS
- DHARNA
- GURUKULA
- NAGARKURNOOL
- నాగర్కర్నూల్
- బిజినేపల్లి
- Comments Off on గురుకులను ఎత్తివేయడం తగదు