Breaking News

గుట్టుగా గుట్కా విక్రయాలు

సారథి న్యూస్, హుస్నాబాద్: కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట పోలీస్​స్టేషన్​ పరిధిలోని రామవరం గ్రామంలో 30 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గుట్కాప్యాకెట్లు నిలువ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన వెంకటేశం, రవితేజ ఇంట్లో గట్కా ప్యాకెట్లు దొరికాయి. సంపత్​ అనే వ్యాపారి వీరికి గుట్కా ప్యాకెట్లు విక్రయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.