లెజెండరీ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ బాలీవుడ్ హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పుడు ‘గుంజన్ సక్సేనా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జాన్వి యుద్ధ పైలెట్గా కనిపిస్తుంది. భారతదేశపు తొలి మహిళా ఐఏఎఫ్ పైలెట్. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న లేడీ పైలెట్గా ‘కార్గిల్ గర్ల్’గా ఖ్యాతికెక్కిన గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం జాన్వీ ఎంతో శ్రమించింది. శరణ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోపిక్ ఆగష్టు 12న ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ప్లిక్స్ లో విడుదల కానుంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ ట్రైలర్ ను రిలీజ్చేశారు.
‘నువ్వు ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలంటే సోల్జర్ గా మారాలి.. లేకపోతే తిరిగి వంటగదికి వెళ్లిపోండి’ అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘మా డ్యూటీ దేశాన్ని కాపాడడం.. నీకు ఈక్వల్ ఆపర్చ్యునిటీ ఇవ్వడం కాదు’ అంటూ సైనికులకు జెండర్ ని బట్టి అవకాశాలు ఉండవని తెలిపారు. ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసిన ఓ బాలిక నేను పైలెట్ అవుతాను.. అని సోదరుడికి చెప్పగా ‘అమ్మాయిలు పైలెట్ అవలేరు’ అని చెబుతారు. ‘నువ్వు ఆర్మీ లో జాయిన్ అయినప్పుడు.. నేను ఎందుకు ఫైలెట్ అవ్వకూడదు’ అని ప్రశ్నిస్తుంది. మరోవైపు తన తండ్రి విమానం నడపడానికి అమ్మాయా? అబ్బాయా? అనేది మ్యాటర్ కాదు.. ఎందుకంటే వాళిద్దరిని కూడా ‘పైలెట్’ అనే పిలుస్తారు అంటాడు.
లేడీ ఫైలెట్ కు టాయిలెట్స్ లేకపోవడం.. అబ్బాయిలతో దీటుగా ఎనర్జీ మెయింటెనెన్స్చేయాలని కించపరచడం వంటివి ఈ ట్రైలర్ లో చూపించారు. గుంజన్ సక్సేనా ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాయిన్ అయ్యాక ఎలాంటి ప్రాబ్లమ్స్ఫేస్ చేసిందనే విషయాలను ట్రైలర్లో స్పష్టంగా చూపించారు. జాన్వీతో పాటు ఈ సినిమాలో అంగద్ బేడీ, మానవ్ విజ్, పంకజ్ త్రిపాఠి, రజత్ బర్మేచా, నీనాగుప్తా, విజయ్ వర్మ ఇతర ప్రధానపాత్రల్లో నటించగా ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని సమకూర్చారు.