సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన జన్మదిన సందర్భంగా ఇచ్చిన ‘గిఫ్ట్స్మైల్’ పిలుపునకు స్పందించిన పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కోవిడ్ రెఫరెన్స్ అంబులెన్స్ వాహనాలను ఇవ్వడానికి ముందుకొచ్చారు. మంగళవారం ప్రగతిభవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో 8 కొత్త అంబులెన్స్ సర్వీసులను జెండా ఊపి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రులు మల్లారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జీవన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, వేమిరెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
- September 8, 2020
- Archive
- Top News
- పొలిటికల్
- COVIDAMBULANCE
- GIFTSMILE
- KTR
- కోవిడ్ అంబులెన్స్
- గిఫ్ట్స్మైల్
- మంత్రి కేటీఆర్
- Comments Off on ‘గిఫ్ట్స్మైల్’ పిలుపునకు విశేష స్పందన