Breaking News

గాడిదలకు బీమా కల్పించండి.. ఎందుకంటే?

గాడిదలకు బీమా కల్పించండి.. ఎందుకంటే?

సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: కాలం మారుతున్నా కొద్దీ యాంత్రిక శక్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రైతులు వ్యవసాయ పొలంలో దుక్కులు దున్నేకాడి నుంచి పంటను తీసుకెళ్లే వరకు ప్రతిపనిలో యంత్రాలు, ట్రాక్టర్లను వాడుతున్నారు. కానీ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో రైతులు పాతకాలం నాటి పద్ధతులనే వాడుతున్నారు. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం.

కంగ్టి మండల పరిధిలోని చాప్టా(కే) గ్రామంలో యూరియా, డీఏపీ మందు సంచులు, సేంద్రియ ఎరువులను రైతులు తమ పొలాల్లోకి తీసుకెళ్లడానికి గాడిదలనే వాడుతున్నారు. రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించి, బరువులు మోసే బాధ్యతలను గాడిదలు తమ భుజాన వేసుకున్నాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలకు రోడ్లు మొత్తం చిత్తడిగా మారడంతో పొలాల్లోకి వాహనాలు వెళ్లడం లేదు. బురదలోనూ వాగులు, వంకలను దాటుతూ పొలాల్లోకి మందు సంచులను తీసుకెళ్తున్నాయి గాడిదలు. ఒక్కో గాడిద ఈజీగా 80 నుంచి 90 కిలోల బరువును మోయగలదు. ఎంతటి బురదలోనైనా బరువును ఈజీగా మోసుకుని తీసుకెళ్లగలవు. తమకు వ్యవసాయ పనుల్లో అండగా ఉంటున్న గాడిదలకు ఇతర పశువుల మాదిరిగానే బీమా సౌలత్​కల్పించాలని స్థానిక కుమ్మరుల కోరుతున్నారు.