సారథి న్యూస్, రామడుగు: సర్వస్వం కోల్పోయిన ఓ గల్ఫ్ బాధితుడికి దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి అండగా నిలబడింది. ఆదిలాబాద్ జిల్లా, సారంగాపూర్ మండలం, చించోలికి చెందిన అంధకూర్ లింగయ్య కొంతకాలం క్రితం ఓ ఏజెంట్ సాయంతో దుబాయ్ వెళ్లాడు. కానీ అతడికి అక్కడ పనిదొరకలేదు. దీంతో ట్రక్కుల మధ్యలో పడుకుంటూ.. యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి సమన్వయకర్త గణేశ్, సామాజికవేత్త జైతా నారాయణ లింగయ్య అతడికి ఉండటానికి వసతి సమకూర్చారు. పాస్‌పోర్టు లేకపోవడంతో స్వదేశానికి వెళ్లడానికి కావలసిన డాక్యుమెంట్స్ సిద్ధం చేశారు. అనంతరం అతడికి ప్రయాణ టికెట్‌ను కూడా సమకూర్చి స్వదేశానికి పంపించారు. ఈ సందర్భంగా లింగయ్య తనకు సాయం చేసిన రవి బొల్లారం, రవి ఊట్నరు, గణేశ్ పింజర, చిలుముల రమేశ్, జైతా నారాయణ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- July 24, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- ADILABAD
- AGENT
- DUBAI
- GULF
- రామడుగు
- సామాజికవేత్త
- Comments Off on గల్ప్ బాధితుడికి చేయూత