సారథి న్యూస్, హుస్నాబాద్: గండిపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రటరీ రజత్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టును రీ డిజైన్ చేసిన తర్వాత పనులు చేపట్టకుండా పూర్తిగా నిలిచిపోయాయన్నారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న భూమి నిర్వాసితులకు నష్ట పరిహారం అందించకుండా జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన యువకులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వడమే కాకుండా 59 మంది పేర్లు గెజిట్ లో నమోదైన ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన నాలుగొందల ఎకరాల పట్టా, ప్రభుత్వ భూమికి ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న రేటును అందించాలన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్, బాలమల్లు, వనేశ్, హన్మిరెడ్డి, భాస్కర్, జనార్దన్, మధుసూదన్, శ్రీనివాస్, సంజీవ రెడ్డి, పరుశరాములు, సంపత్ పాల్గొన్నారు.
- June 20, 2020
- Archive
- తెలంగాణ
- మెదక్
- లోకల్ న్యూస్
- CPI
- GANDIPALLY
- గండిపల్లి ప్రాజెక్టు
- గౌరవెల్లి
- Comments Off on గండిపల్లి ప్రాజెక్టును పూర్తిచేయాలి