![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/KATRINA-KAIFFF-HYDER.jpg?fit=729%2C494&ssl=1)
గతేడాది విడుదలైన ‘ఖైదీ’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. విభిన్నకథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కార్తీ హీరో నటించగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయనున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా.. కత్రీనాను హీరోయిన్గా ఎంపికచేశారట. వాస్తవానికి తమిళ మాతృకలో హీరోయిన్ పాత్ర ఉండదు. హిందీలో కొన్ని మార్పులు చేసి హీరోయిన్ పాత్రను యాడ్చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో నటించేందుకు కత్రీనా ఓకే చెప్పిందట. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట.