Breaking News

‘ఖైదీ’ డైరెక్టర్​తో మహేశ్​ మూవీ

KAIDI DIRECTOR

తమిళ డైరెక్టర్​ లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వంలో సూపర్​స్టార్​ మహేశ్​బాబు ఓ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కనగరాజ్​ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తెలుగు, తమిళనాట సూపర్​హిట్​ అందుకున్నది. దీంతో ఖైదీ సినిమా చూసిన మహేశ్ బాబు​.. కనగరాజ్​ డైరెక్షన్​కు ఫిదా అయ్యారట. అయితే వీరు తీయబోయే చిత్రానికి ఓ తెలుగు రచయిత పవర్​ఫుల్​ కథను కూడా సిద్ధం చేసినట్టు టాక్​. ‘భరత్​ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో హ్యాట్రిక్​ అందుకున్న మహేశ్.. కథల విషయంలో చాలా కేర్​ తీసుకుంటారన్నది తెలిసిన విషయమే. అయితే కనగరాజ్​ దర్శకత్వంలో మహేశ్​ ఓ కొత్తతరహా పాత్రలో నటించనున్నట్టు టాక్​. మహేశ్​ ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్​లో ‘సర్కార్​ వారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత కనకరాజ్​ సినిమా ప్రారంభించనున్నట్టు టాక్​. చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్టు సమాచారం.