న్యూఢిల్లీ: భారత స్టార్ స్ర్పింటర్ హిమాదాస్.. ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు రేస్‌లో నిలిచింది. ఈ పురస్కారం కోసం ఆమె పేరును అసోం ప్రభుత్వం సిఫారసు చేసింది. 2018లో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్ షిప్‌తో పాటు మహిళల 400 మీటర్లలో స్వర్ణం గెలిచిన హిమా.. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో తొలి పసిడి గెలిచిన అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, 400 మీటర్ల వ్యక్తిగత పరుగులో రజతం నెగ్గింది. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పలు పోటీల్లో అనేక పతకాలు కొల్లగొట్టింది. 2018 అర్జున అవార్డు నెగ్గిన హిమా.. ఈసారి ఖేల్ రత్నకోసం చాలా మందితో పోటీపడాల్సి ఉంది.