రెండు సంవత్సరాల తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ముందుగా ఆయన బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్లో హిట్టయిన ‘పింక్’ సినిమాని తెలుగులో పవన్ ప్రధాన పాత్రలో ‘వకీల్ సాబ్’ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ కీలకదశకు చేరుకుంది కూడా. అయితే కరోనా కారణంగా నిలిచిపోయింది. దీంతోపాటు పవన్ క్రిష్ డైరెక్షన్ మరో చిత్రాన్ని లైన్లో పెట్టారు. మొగల్ సామ్రాజ్యంలో వజ్రాల దొంగగా కనిపించే ఈ పిరియాడికల్ డ్రామాలో పవన్ దొంగగా కనిపించనున్నారు. ఏఎం రత్నం భారీ బడ్జెతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్‌గా రెండు షెడ్యూల్ పూర్తయ్యింది కూడా. అయితే మధ్యలో నిలిచిపోయిన ఈ రెండు చిత్రాల షూటింగ్ గురించి చర్చలు జరుగుతుండగా పవన్‌కల్యాణ్ జనసేన సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తను ఇప్పుడప్పుడే షూటింగ్లో పాల్గొనేది లేదని.. ‘ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతిలిచ్చినా చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదు.. ఎవరికైనా కరోనా రావచ్చు. మొన్న అమితాబ్ బచ్చన్ గారికి వచ్చినట్టే.. మెయిన్ హీరోలు ఎవరికి వచ్చినా అది ఇతరులకు సోకే చాన్స్ చాలా ఉంటుంది.. వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే’ అంటూ ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో ఉన్న పవన్ తన నిర్ణయాన్ని చాలా స్పష్టంగా చెప్పేశారు
- July 26, 2020
- Archive
- సినిమా
- NEW PROJECT
- PAWAN KALYAN
- POWERSTAR
- పవర్‌స్టార్
- బోనీ కపూర్
- Comments Off on క్లారిటీ ఇచ్చిన పవన్