Breaking News

క్యాష్ లేకున్నా బస్సు ఎక్కొచ్చు

సారథి న్యూస్​, హైదరాబాద్​: జేబులో చిల్లిగవ్వ లేకున్నా ఆర్టీసీ బస్సు ఎక్కొచ్చు.. గూగుల్​ పే, ఫోన్​ పే, పేటీఎంలో డబ్బులు ఉంటే చాలు. చేతిలో నగదు లేకుండా ప్రయాణించేందుకు వీలు కల్పించింది సంస్థ. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో క్యాష్​ ఉంటేనే ప్రయాణించాల్సి వచ్చేది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా జూన్​ 30వ తేదీ వరకు లాక్​ డౌన్​ 5.0 అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజారవాణాకు అనుమతి ఇవ్వడంతో బస్సులు, ప్రైవేట్​ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోనూ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కరోనా నేపథ్యంలో బస్సుల్లో వెళ్లాలంటే భయపడుతున్నారు. అందులోనూ టికెట్​ తీసుకునేందుకు ప్రయాణికులు, అటు టికెట్​ ఇష్యూ చేసేందుకు కండక్టర్లు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ క్యాష్ సేవలు అందించేలా ఫోన్‌ పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్​ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అందుకు సంబంధించిన క్యూ ఆర్​ కోడ్​ను రెడీచేసింది. ప్రయాణికులు క్యూ ఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి టికెట్​కు సరిపడా డబ్బును చెల్లించవచ్చు. అప్పుడు చిల్లరకు కూడా ఇబ్బంది ఉండదు.