అఖిల్ అక్కినేని చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హ్యట్ పెట్టుకుని చేతిలో గన్ తో కౌ బాయ్ గెటప్ లో ఉన్న ఆ ఫొటో ఒకటి ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ ఫొటోకు ఓ నేపథ్యం ఉంది. 2002లో మహేశ్‌బాబు టక్కరిదొంగ అనే కౌ బాయ్ సినిమా చేశాడు. ఆ సినిమా ప్లాప్ అయింది అది వేరే విషయం. అయితే అప్పట్లో మూవీ సెట్‌కు వెళ్లిన అఖిల్.. కౌ బాయ్ గెటప్‌లో సరదాగా ఓ ఫొటో తీసుకున్నారు. ఆ ఫొటో ఇప్పడు వైరల్‌గా మారింది. అయితే అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే మూడు సినిమాలు తీసినా ఇంతవరకు హిట్ కాలేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా తీస్తున్నారు. 2021లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానుంది.