Breaking News

కోవిడ్​సెంటర్​లో మంటలు.. 11 మంది మృతి

బెజవాడలో భారీ అగ్నిప్రమాదం

సారథిన్యూస్​, విజయవాడ: విజయవాడలోని ఓ కోవిడ్​ సెంటర్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు 11 మంది కరోనా రోగులు మృతిచెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ హోటల్​ స్వర్ణప్యాలెస్​ను కోవిడ్​ కేర్​ సెంటర్​గా వినియోగిస్తున్నారు. ఈ హోటల్​లో దాదాపు 40మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున షార్ట్​సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో కరోనా బాధితులు కేకలు పెట్టారు. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్​ఎఫ్​ దళాలు అక్కడికి చేరుకొని సహాయచచర్యలు చేపట్టాయి. అప్పటికే మంటల్లో చిక్కుకొని ఊపిరాడక 9 మంది మృతిచెందారు. మరో ఇద్దరు దవాఖానలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డవారిని సహాయకసిబ్బంది ప్రభుత్వ ఆంబులెన్స్​ల్లో వివిధ దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
రూ. 50 లక్షలు పరిహారం
ఈ ఘటనపై సీఎం జగన్​ వెంటనే స్పందించారు. బాధితులకు రూ.50 లక్షలు పరిహారమిస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.