ఏడాది క్రితం తెలుగులో ‘ఎవరు’తో బంపర్ హిట్ కొట్టిన రెజీనా కొన్నాళ్లుగా తమిళ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. విశాల్ తో ‘చక్ర’ మూవీలో నటిస్తోంది. సందీప్ కిషన్ తో ‘కసడతపర’.. డైరెక్టర్ కార్తిక్ రాజు తీస్తున్న బైలింగ్వల్ మూవీ తమిళంలో ‘శూర్పణగై’, తెలుగులో ‘నేనే నా’ గా రానున్న ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్ పాత్రలో.. ఇలా వరుస చిత్రాల్లో ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలను చేస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితమే సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నెన్జమ్ మరప్పదిల్లై’ లో ఎస్.జె సూర్య తో కలిసి నటించింది. ఆ చిత్రం ఇంకా రిలీజ్కు నోచుకోలేదు. తర్వాత రెండేళ్ల క్రితం అరవింద స్వామితో ‘కళ్లాపర్ట్’ చిత్రంలో నటించింది. ఆ మూవీ కూడా ఇంకా విడుదల కాలేదు. గతనెల అనౌన్స్ చేసిన ‘ఫ్లాష్ బ్యాక్’ తో కలిసి మొత్తంగా ఆరు కోలీవుడ్ క్రేజీ కమిట్మెంట్స్తో సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్తోంది రెజినా.