Breaking News

కోతకు గురైన రాయిచూర్​ రహదారి

కోతకు గురైన రాయిచూర్​రహదారి

  • స్తంభించిన వాహనాల రాకపోకలు
  • చిన్నపాటి వర్షమొస్తే ఇదే పరిస్థితి

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక ఎప్పటిలాగే జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం బొంకూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర రాయిచూర్​రహదారి కోతకు గురైంది. అర్ధరాత్రి నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. రాయిచూర్​కు వెళ్లాలంటే వయా కలకుంట్ల మీదుగా హైవే నం.44, అలంపూర్ చౌరస్తా వరకు 25 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. మూడేళ్లుగా ఈ పెద్ద వాగుపై బ్రిడ్జిని నిర్మిస్తూనే ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నోసార్లు సదరు కాంట్రాక్టర్ ను హెచ్చరించినా బ్రిడ్జి పనులు మాత్రం నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. సర్పంచ్ శ్రీలత భాస్కర్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలించి అధికారులకు సమాచారం అందించినా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పనులు చేయించి వాహనదారుల ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.

కోతకు గురైన రోడ్డు
ఇబ్బందులు పడుతూ వెళ్తున్న స్థానికులు

One thought on “కోతకు గురైన రాయిచూర్​ రహదారి”

Comments are closed.