దుబాయ్: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కొల్కత్తా నైట్‌రైడర్స్.. రాజస్థాన్ రాయల్స్‌పై 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ ఎంచుకుంది. అయితే నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగుల టార్గెట్ విధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్47( 34 బంతుల్లో, ఒక సిక్స్, నాలుగు ఫోర్లు), నితీష్రానా 22( 17 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్), అండ్రు రస్సెస్ 24(14 బంతుల్లో మూడు సిక్స్‌లు), ఇయాన్ మోర్గాన్30(20 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్స్‌లు), పాటి కమిన్స్12, కమలేష్నగర్ కోటి 8 పరుగుల చొప్పున 174 పరుగులు చేశారు. ఇక రాజస్థాన్రాయల్స్ బౌలర్లు ఆర్చర్2, అంకిత్‌రాజ్ పుత్ఒకటి, జయదేవ్ఉనద్కత్ ఒకటి, రాహుల్ తేవాతియ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ టపటపా వికెట్లను చేజార్చుకుంది. ముగ్గురు బ్యాట్మెన్స్తప్ప మిగతారు రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఓపెనర్ జోస్ బట్లర్21(16 బంతుల్లో ఒక ఫోరు, సిక్స్), రాహుల్ తేవాటియా 14(10 బంతుల్లో ఒక సిక్స్), టామ్ ఖురన్ 50(36 బంతుల్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు) పరుగుల చెప్పుకోదగ్గ స్కోర్ చేయగలిగారు. మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేశారు. కేకేఆర్ బౌలర్లలో శివం మావి రెండు, వరుణ్‌చక్రవర్తి రెండు, కమలేష్నాగకోటి రెండు, సునిల్ నరైన్ ఒకటి, పాట్కమిన్స్ఒకటి, కుల్దీప్ యాదవ్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.
- September 30, 2020
- Archive
- Top News
- సినిమా
- IPL 13
- KKR
- RAJASTAN ROYALS
- RR
- SHUBAMAN
- కొల్కత్తానైట్రైడర్స్
- రాజస్థాన్రాయల్స్
- శుభ్‌మన్‌గిల్
- Comments Off on కొల్కత్తా నైట్ రైడర్స్ గెలుపు