సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ మరింత అభివృద్ధి చెందాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ఆకాంక్షించారు. ఆదివారం ఆయన మార్నింగ్ వాక్‌లో భాగంగా కొల్లాపూర్ లో పర్యటించారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆ మేరకు ప్రణాళికలతో అధికారులు ముందుకు సాగాలని సూచించారు. మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. కరెంట్ బిల్లులు నెలనెలా చెల్లించాలని, విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచించారు. పట్టణంలో డంపింగ్ యార్డ్ పనులను కంప్లీట్ చేయాలన్నారు. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకే చైర్మన్, కమిషనర్, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని, పారిశుద్ధ్య పనులపై పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్ పలువురు వీధి విక్రయదారులతో మాట్లాడారు. రోడ్ల వెంట మొక్కలు నాటాలని సూచించారు. కలెక్టర్ వెంట మార్నింగ్ వాక్ లో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ మహముదాబేగం, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.
- July 19, 2020
- Top News
- COLLECTOR
- KOLLAPUR
- NAGARKURNOOL
- SHARMAN
- కలెక్టర్ శర్మన్
- కొల్లాపూర్
- నాగర్‌కర్నూల్
- Comments Off on కొల్లాపూర్ అభివృద్ధి చెందాలి