ముంబై: బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ అస్వస్థతకు లోనయ్యారు. శ్వాససంబంధిత ఇబ్బందితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేరిపంచారు. దవాఖాన సిబ్బంది ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని తేలింది. దీంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, రెండు మూడురోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. బాలీవుడ్లో సరోజ్‌ఖాన్‌కు ఎంతో క్రేజ్ ఉంది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్ వంటి హీరోయిన్లకు ఆమెకు డాన్స్ కంపోజ్ చేశారు. దేవదాస్ సినిమాలోని ‘డోలా రే డోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ ఆడిపాడిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి గాను సరోజ్ ఖాన్‌కు జాతీయ అవార్డులు లభించాయి. చివరగా మాధురి నటించిన ‘కలంక్’ చిత్రంలోని కొన్ని పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
- June 24, 2020
- Archive
- సినిమా
- BOLLYWOOD
- CARONA
- SAROJKHAN
- మాధురీ దీక్షిత్
- శ్రీదేవి
- Comments Off on కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ కు అస్వస్థత