Breaking News

కొరటాలకు భారీ ఆఫర్​

వరుస హిట్లతో దూసుకెళ్తున్న కొరటాల శివకు భారీ ఆఫర్​ వచ్చింది. చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్​ వారి బ్యానర్​లోని చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బన్నీతో పుష్ప, మహేష్​తో సర్కారు వారి పాట చిత్రాలను తెరకెక్కిస్తున్నది. తర్వాత చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. మైత్రీ వారు కొరటాలకు భారీ పారితోషికం కూడా ఆఫర్​ చేసినట్టు సమాచారం. 2021లో ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఈ హీరోలో హీరో, హీరోయిన్స్​ ఎవరో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.