సారథి న్యూస్, హైదారాబాద్: వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను తెరవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వరి క్వింటాలుకు రూ.1880కి అమ్మాల్సిన ధాన్యం రూ.1600, రూ.5,825 అమ్మాల్సిన పత్తి రూ.3,500కు అమ్ముతున్నారని, ప్రభుత్వం కల్పించుకుని కొనుగోలు కేంద్రాలను తెరవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.జంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ కోరారు. వ్యవసాయశాఖ మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లయీస్ శాఖల మధ్య సమన్వయం లేక మార్కెటింగ్ సక్రమంగా జరగడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న విధానాలు, ఆచరణకు పోలిక లేదన్నారు. అక్టోబర్ 14న కనీస మద్దతు ధరల హక్కుల దినంగా పాటించడానికి నిరాహార దీక్షలు చేపట్టాలని వారు రైతులకు పిలుపునిచ్చారు.
- October 11, 2020
- Archive
- తెలంగాణ
- హైదరాబాద్
- CM KCR
- rythu sangam
- TELANGANA
- తెలంగాణ
- రైతు సంఘం
- సీఎం కేసీఆర్
- హైదరాబాద్
- Comments Off on కొనుగోలు కేంద్రాలను తెరవండి