సారథి న్యూస్, నాగర్ కర్నూల్: కల్వకుర్తి నేషనల్హైవే 167 నుంచి నాగర్ కర్నూల్, కొల్లాపూర్, సోమశిల, ఆత్మకూరు, కరివేన నేషనల్హైవే 340 ను కలుపుతూ తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా నూతన జాతీయ రహదారిని ఏర్పాటు చేయాలని మంగళవారం నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు నేషనల్రోడ్డు ట్రాన్స్పోర్ట్, హైవేస్ సెక్రటరీ గిరిధర్‌ను కలిసి కోరారు. గద్వాల జిల్లా ఎర్రవెల్లి చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ కోసం డీపీఆర్‌ను త్వరితగతిన పూర్తిచేసి పనులు ప్రారంభించాలన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నూతనంగా ఈఆర్ఎఫ్ రోడ్స్ మంజూరు చేయాలన్నారు. అలంపూర్ 5వ శక్తిపీఠం జోగుళాంబ ఆలయ అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద మౌలిక సదుపాయాలు కల్పించాలని టూరిజం, కల్చరల్ శాఖ కార్యదర్శి యోగేంద్ర త్రిపాఠిని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారని ఎంపీ రాములు తెలిపారు.
- September 22, 2020
- Archive
- Top News
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- MP RAMULU
- NAGARKURNOOL
- NATIONAL HIGHWAYS
- ROAD TRANSPORT
- ఎంపీ రాములు
- నాగర్‌కర్నూల్
- నేషనల్ హైవేస్
- Comments Off on కొత్త నేషనల్ హైవే పనులు చేపట్టండి