సారథిన్యూస్, హైదరాబాద్: విప్లవకవి వరవరరావును విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. తెలంగాణ వాది అయిన వరవరరావు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం చేసిన ప్రతి పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. బీమాకోరేగావ్ కేసులో అరెస్టయిన వరవరరావు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉన్నదని చెప్పారు. ఈ కేసు కేంద్రప్రభుత్వం పరిధిలో ఉన్నందున సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ప్రధాని మోదీతో చర్చించాలని కోరారు.
- July 15, 2020
- Archive
- Top News
- KCR
- కేసీఆర్
- Comments Off on కేసీఆర్ సార్ మీరే పట్టించుకోవాలే