Breaking News

కేరళ రూల్స్​ ఏడాది అమలు

కేరళ రూల్స్​ ఏడాది అమలు

తిరువనంతపురం: కరోనాను కట్టడి చేసేందుకు కేరళలో విధించిన రూల్స్‌ మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. మాస్కులు వాడడం, సోషల్‌ డిస్టెంసింగ్‌ ఏడాది పాటు కచ్చితంగా పాటించాలని కేరళ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పెళ్లిలు, ఫంక్షన్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పింది. సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు లాంటి వాటిపై సంవత్సరం పాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. షాపులు, మాల్స్‌లో ఒక్కసారి కేవలం 20 మందిని మాత్రమే అనుమతించాలని, షాపు సైజును బట్టి సంఖ్యను తగ్గించాలన్నారు. మన దేశంలో మొదటి కరోనా కేసు నమోదైంది కేరళలోనే. ఈ ఏడాది జనవరిలో మొదటి కేసు నమోదు కాగా, ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేసుల సంఖ్య చాలా వరకు తక్కువగా ఉంది.