ఇండియా అంతా ఎదురుచూస్తున్న సినిమా ‘కేజీఎఫ్ 2’ అంటే అతిశయోక్తి కాదేమో. ఆ సినిమాకొచ్చిన క్రేజ్ అలాంటిది. ‘కేజీఎఫ్’ ఫస్ట్ పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. నార్త్, సౌత్‌లో ఒక ఊపు ఊపేసింది. సీక్వెల్ కోసం అభిమానులంతా తెగ ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్, శ్రీనిధిశెట్టి జంటగా సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రవీనాటాండన్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈమూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 2021 జనవరి 8న యశ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు టీజర్ తో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ప్రశాంత్. అదేరోజు ఉదయం 10:18 గంటలకు రాఖీభాయ్ సామ్రాజ్యానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ యశ్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రశాంత్ నీల్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత విజయ్ కిరంగదూర్. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. అధీరాగా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సహా టీమ్ అంతా షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
- December 21, 2020
- Archive
- Top News
- సినిమా
- KGF
- PRAKASHRAJ
- PRASHANTH NEEL
- SANJAYDATT
- కేజీఎఫ్
- ప్రకాష్ రాజ్
- ప్రశాంత్ నీల్
- సంజయ్ దత్
- Comments Off on కేజీఎఫ్ హీరోకు బర్త్ డే గిఫ్ట్