- బొంకూర్ గ్రామంలో తప్పిన పెనుప్రమాదం
- ముగ్గురు పిల్లలతో బయటపడ్డ కుటుంబం
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ఇల్లు.. కుటుంబమంతా గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామానికి చెందిన పరమేశ్గౌడ్, మంజుల దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి సోమవారం నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉండగా, ఒక్కసారిగా మట్టిమిద్దె పైకప్పు కూలి నిద్రిస్తున్నవారిపై పడింది. కాళ్ల వైపున ఇళ్లు కూలడంతో పిల్లలను చంకలో పెట్టుకుని ప్రాణభయంతో బయటకు పరుగుతీశారు. వారికి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వారికి పెనుప్రమాదం తప్పినట్లయింది. విషయం తెలుసుకున్న సర్పంచ్ శ్రీలత భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి తక్షణమే రూ.ఐదువేల ఆర్థిక సాయాన్ని పరమేశ్గౌడ్కు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. అనంతరం అనంతపురం గ్రామ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి పరామర్శించారు.