సారథి న్యూస్, కంగ్టి: నీటి కుంటలో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో చోటు చేసుకుంది. కురుమ గాయత్రి(8) తల్లితో కలిసివెళ్లి శనివారం ఉదయం బట్టలు ఉతకడానికి గ్రామ శివారులోని నీటి కుంటలోకి దిగి బట్టలు ఉతుకుతున్న సమయంలో కాలు జారీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి చూడగానే శ్వాస ఆడక కొట్టుమిట్టాడుతున్న బిడ్డను చూసి సృహకోల్పోయింది. నీటిలో మునిగిన బిడ్డను బయటికి తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. కళ్ల ముందే బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
- October 17, 2020
- Archive
- క్రైమ్
- మెదక్
- CHILD DEATH
- NARAYANAKHED
- SANGAREDDY
- చాప్టా(కే)
- నారాయణఖేడ్
- సంగారెడ్డి
- Comments Off on కుంటలో పడి చిన్నారి మృతి