‘గీత గోవిందం’ ఫేమ్ పరుశురామ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్లో ‘సర్కారు వారి పాట’ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్- 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ చిత్రం టైటిల్‌నే ఇంత ఫాసినేట్గా డిసైడ్ చేశారంటే క్యాస్టింగ్ విషయంలోనూ అలాగే ఉంటుందని అనుకున్నారంతా. అనుకున్నట్టుగానే హీరోయిన్ కోసం మొదట ‘భరత్ అను నేను’ ఫేమ్ కియారాను సంప్రదించారట. డేట్స్ కుదరని కారణంగా కియారా ఎస్ ఆర్ నో చెప్పలేని సందిగ్ధంలో ఉండిపోయింది. తర్వాత ‘మహర్షి’ ఫేమ్ పూజా హెగ్డే అని, బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ అని రకరకాల రూమర్లు వచ్చాయి.
అయితే సడెన్‌గా మలయాళీ ముద్దుగుమ్మ కీర్తిసురేష్ హీరోయిన్ అన్న విషయం స్ప్రెడ్ అయింది. కీర్తి కూడా ఎస్ చెప్పింది అంటున్న వార్త కూడా వచ్చింది. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే వచ్చిన చిక్కంతా కీర్తి రెమ్యునరేషన్ విషయంలోనే. మామూలుగా తీసుకునే దానికంటే ‘మహానటి’ తర్వాత కీర్తి తన రేటును ఆమాంతం పెంచేసిందట. దీంతో కొంత మంది ప్రొడ్యూసర్స్ ఆమె జోలికి వెళ్లడం కూడా మానుకున్నారు. అయితే ఈ కరోనా కారణంగా రేటు తగ్గిస్తుందనే నమ్మకంతో ఆమెను సంప్రదించారట. ఈసారి తగ్గించిందేమో అనుకుంటున్నా రెమ్యునరేషన్ రూ.కోటి వరకూ అయితే ఉండొచ్చట. అన్ని విషయాలు మాట్లాడుకుని క్లారిటీకి వచ్చాకే చిత్రయూనిట్ హీరోయిన్ను అధికారికంగా ప్రకటించనున్నారట.