నోయిడా: కరోనా బారినపడ్డ ఓ యువతిని వైద్యుడు లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా జైపీ దవాఖానలో చోటుచేసుకున్నది. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న ఓ యువతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆమె జైపీ దవాఖానలో చేరింది. కాగా జైపీ దవాఖానలో పనిచేస్తున్న ఓ యువ వైద్యుడికి కూడా కరోనా సోకింది. కాగా దవాఖాన సిబ్బంది.. వీరిద్దరికీ ఒకే గదిని( ట్విన్బెడ్ షేరింగ్రూమ్) కేటాయించారు. దీంతో యువతితో సదరు వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.