సారథి న్యూస్, నకిరేకల్: తన సమస్యను పరిష్కరించాలని పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళతో అసభ్యంగా వ్యవహరించిన నకిరేకల్ హెడ్ కానిస్టేబుల్ రఘును నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్ ఆదేశాలు ఆదివారం జారీ చేశారు. తనను వేధిస్తున్న తన భర్త నుంచి తనకు రక్షణ కల్పించాలని, తన సమస్యను పరిష్కరించాలని నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒక మహిళతో హెడ్ కానిస్టేబుల్ రఘు అసభ్యంగా ప్రవర్తించినట్లుగా వచ్చిన సమాచారం మేరకు విచారణ జరపి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని అదనపు ఎస్పీ నర్మదను ఆయన ఆదేశించారు. మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఎలాంటి సమస్య ఎదురైనా డయల్ 100 ద్వారా గానీ, తనకు, అదనపు ఎస్పీ నర్మదకు నేరుగా సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.