సారథిన్యూస్,చొప్పదండి: ప్రతి కార్యకర్తను కంటికి కంటికి రెప్పలా కపాడుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పిట్టల రాజ్ కుమార్ కుటుంబాన్ని గురువారం ఎమ్మెల్యే పరామర్శించారు. బాధిత కుటుంబానికి రెండు లక్షల రూపాయల సభ్యత్వ బీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. టీఆర్ఎస్ కార్యకర్త చనిపోతే ఆ కుటుంబం వీధిపాలు కాకుండా ఉండేందుకు పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటిఆర్ పార్టీ సభ్యత్వానికి రెండు లక్షల ప్రమాద బీమా ప్రవేశపెట్టారని తెలిపారు.
- June 11, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CHOPPADANDI
- SUNKE RAVISHANKAR
- TRS
- సభ్యత్వ బీమా
- Comments Off on కార్యకర్తలను కాపాడుకుంటాం