సారథి న్యూస్, రామగుండం: కాంట్రాక్ట్ కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బందికి లాక్డౌన్ సమయంలోని ఏప్రిల్ మాసంలో 50 శాతం వేతనాలు అందించేందుకు ఆ సంస్థ యజమాన్యం అంగీకారం తెలిపారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో కేశోరాం ఫ్యాక్టరీ కాంట్రాక్టు కార్మికులతో ఎమ్మెల్యే మాట్లాడారు. లాక్ డౌన్ కాలంలో వేతనాలు ఇప్పించాలని కార్మికులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఎమ్మెల్యే ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి 50 శాతం వేతనాలు ఇప్పించేందుకు ఒప్పించారు.
- June 10, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- LOCKDOWN
- RAMAGUNDAM
- ఎమ్మెల్యే కోరుకంటి
- కేశోరాం
- Comments Off on కార్మికులను ఆదుకుంటాం