Breaking News

కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదానం


సారథి న్యూస్​, ఎల్బీనగర్: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కొత్తపేట డివిజన్ లో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు లింగాల కిషోర్ గౌడ్, ఎల్బీనగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జైపాల్, చైతన్యపురి డివిజన్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 78మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. జీహెచ్ఎంసీ శానిటరీ విభాగం పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, హ్యాండ్ గ్లౌసులు, పండ్లు, మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్యాంగౌడ్, కొప్పుల నరసింహారెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, పీసీసీ సెక్రటరీ గజ్జి భాస్కర్ యాదవ్, లింగోజిగూడ అధ్యక్షుడు మల్లారం శ్రీనివాస్, మహ్మద్ షరీఫ్, రంగు జగన్ గౌడ్, గంటి శశిధర్ పటేల్, బూరుగుల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.