వాషింగ్టన్: ప్రపంమంతా అస్వస్థతతో కష్టకాలంలో ఉన్న సమయంలో భగవద్గీత చదివితే శాంతి, ధైర్యం కలుగుతుందని అమెరికాలోని మొదటి హిందూ లా మేకర్ తులసీ గబ్బార్డ్ అన్నారు. హవ్వాయి నుంచి ఒక వర్చువల్ కమెన్స్‌మెంట్‌లో మాట్లాడిన తులసీ ఈ విషయాలు చెప్పారు. రేపు ఏం అవుతుందో ఎవరికి తెలియదని, అందుకే ఇలాంటి టైమ్‌లో అందరూ భగవద్గీత చదవాలని సూచించారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన భక్తి యోగా, కర్మ యోగా ద్వారా మనకు ధైర్యం, శాంతి రెండు కలుగుతాయని క్లాస్ ఆఫ్ 2020 ఫర్ హిందూ స్టూడెంట్స్‌లో చెప్పారు.
‘జీవితంలో కొత్త అధ్యాయం గురించి ఆలోచిస్తున్నప్పుడు జీవితం ఉద్దేశం ఏంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కర్మ యోగాను అభ్యస్తిస్తున్న మీరు దేవుడికి సేవ చేయడమే మీ ఉద్దేశం అని గుర్తించ గలిగితే విజయవంతమైనట్లు’ అని అన్నారు. సక్సెస్‌ను కేవలం భౌతిక విషయాలు, మెరిసే వస్తువుల ద్వారా నిర్వచించలేమని, అది సేవ చుట్టూ కేంద్రీకృతమైన విజయవంతమైన, సంతోషకరమైన జీవితం అని తులసీ అన్నారు. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని హిందూ స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన ఈ కమెన్స్‌మెంట్‌నులో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు.