Breaking News

కష్టకాలంలోనూ రైతులను ఆదుకున్నాం

కష్టకాలంలోనూ రైతులను ఆదుకున్నాం

సారథి న్యూస్, మెదక్: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నా రాష్ట్రంలో రైతులకు రైతుబంధు డబ్బులను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రమైన మెదక్ కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక వైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పాటు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

ఇరిగేషన్ రంగంలో వెనకబడిన మెదక్ జిల్లా ప్రస్తుతం 33 శాతం పెరిగిందని, ఈ విషయంలో ఆ శాఖ అధికారుల పనితీరు ఎంతో బాగుందని మంత్రి కితాబిచ్చారు. అనంతరం మెదక్ పట్టణంలోని గోసముద్రం చెరువులో చేపపిల్లలను వదిలారు. అనంతరం పట్టణంలో కరోనా ఐసోలేషన్ సెంటర్, చిల్డ్రన్స్ పార్కు వద్ద నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్​పర్సన్ హేమలత, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేష్, జిల్లా ఎస్పీ చందనాదీప్తి, ఇప్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్​పర్సన్ ​లావణ్యరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి మెదక్ మున్సిపల్ చైర్మన్ టి.చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.