నందమూరి హీరోల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా కాలమైంది. ‘పటాస్’ తర్వాత ఆ స్థాయి హిట్ రిపీట్ చేసేందుకు నందమూరి హీరో సీరియస్ గానే ట్రై చేస్తున్నాడు. గతంలో కేవీ గుహన్ డైరెక్షన్ లో వచ్చిన ‘118’ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఎంత మంచివాడవురా’ యావరేజ్ గానే మిగిలిపోయింది. ప్రస్తుతం కొత్త దర్శకుడు వశిష్టతో ఓ మూవీ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్ తో తెరకెక్కతున్న ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే సంకల్పంతో ఉన్నాడు. అయితే.. లేటెస్ట్ గా మరో న్యూస్ బయటకు వచ్చింది. దిల్ రాజు ప్రెస్టేజియస్ బ్యానర్ లో చిత్రాన్ని చేయనున్నాడని. ఈ చిత్రానికి ‘డు ఆర్ డై’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. అన్నీ కుదిరితే కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ మూవీ కంటే ముందే ఈ దిల్ రాజు ఈ మూవీని విడుదల చేస్తారట. ఈ రెండు చిత్రాలు కాకుండా.. సితార ఎంటర్టైన్మెంట్స్బ్యానర్ పై కూడా కళ్యాణ్ రామ్ ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఆ వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి నందమూరి హీరో రాబోయే ఏడాదిలో వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా మారనున్నాడన్న మాట.
- December 27, 2020
- Archive
- Top News
- సినిమా
- DIL RAJU
- DIRECTOR VASHISTA
- KALYANRAM
- NADAMURI
- కళ్యాణ్‌రామ్
- డైరెక్టర్ వశిష్ట
- దిల్ రాజు
- నందమూరి
- Comments Off on కళ్యాణ్‌రామ్.. ‘డు ఆర్ డై’