Breaking News

కల్లాల నిర్మాణం కంప్లీట్ కావాలి

కల్లాల నిర్మాణం కంప్లీట్ కావాలి

సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని, ప్రత్యేకాధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా ఇన్​చార్జ్​కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం మెదక్ కలెక్టరేట్ లో జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులతో డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు, వైకుంఠధామాల నిర్మాణాలు, రైతుకల్లాల విషయాలపై చర్చించారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన వారికి నిధులు విడుదల చేసి వారి ఖాతాల్లో డబ్బులు ఎప్పటికప్పుడు జమచేయాలని సూచించారు.

పనుల ఫొటోలను ఎప్పటికప్పుడు అప్ లోడ్​చేయాలన్నారు. వచ్చే శనివారం నిర్వహించే సమీక్ష సమావేశానికి జిల్లా అధికారులంతా హాజరుకావాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, డీఏవో పరశురామ్ నాయక్, పంచాయతీ ఈఈ రామచంద్రారెడ్డి, డీపీవో హనోక్, డీడబ్ల్యూవో రసూల్​బీ, ఇరిగేషన్ ఈఈ యేసయ్య, జిల్లా సర్వే ల్యాండ్స్ అధికారి గంగయ్య, మైనింగ్ అధికారి జయరాజ్ పాల్గొన్నారు.