సారథి న్యూస్, సూర్యాపేట: చైనా సైనికుల దొంగ దాడిలో అసువులు బాసిన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సోమవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి, ఆయన పిల్లలు, తల్లిదండ్రులను పలకరించారు. వారిని చూసి సీఎం ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. పిల్లలు సీఎంకు నమస్కరించారు. అనంతరం సంతోష్ బాబు సతీమణికి గ్రూప్1 ఉద్యోగ నియామకపత్రంతో పాటు రూ.ఐదుకోట్ల విలువైన చెక్కు, 570 గజాల ఇంటిస్థలం డాక్యుమెంట్లను అందజేశారు. సీఎం వెంట విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు.
- June 22, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- COLNOL SANTHOSH
- కల్నల్ సంతోష్ బాబు
- సీఎం కేసీఆర్
- సూర్యాపేట
- Comments Off on కల్నల్ కుటుంబానికి సీఎం ఓదార్పు