- మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి
సారథి న్యూస్, హైదరాబాద్: రైతులకు కల్తీ విత్తనాలు అంటగడితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఆఫీసులో వివిధ జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర వ్యవసాయ ప్రణాళిక అమలులో రైతు సమన్వయ సమితులు కీలకంగా పనిచేయాలని సూచించారు. డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.