Breaking News

కలుషితమైన ఆహారం తిని..

  • 22 మందికి అస్వస్థత
  • ఇద్దరి పరిస్థితి విషమం

సారథి న్యూస్, ఆదిలాబాద్: కలుషిత ఆహారం తిని 22 మంది అస్వస్థతకు గురైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యాంనాయక్ తండాలో బుధవారం చోటుచేసుకుంది. ఏటా తండాలో దుర్గామాత పూజ నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా జరుపుకున్నారు. రాత్రి వండిన మటన్ ను సంప్రదాయం ప్రకారం పూజలో పాల్గొన్న వారు ప్రసాదంగా తీసుకుంటారు. ఎండకాలం కావడంతో మటన్​ కులుషితం కావడంతో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఉట్నూర్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.