సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఉద్యోగులంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆ సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్కాస్ట్ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఓవర్ బర్డెన్ పనులను పరిశీలించారు. వానకాలంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులకు, కార్మికులకు పలు సూచనలు చేశారు. ఓవర్ బర్డెన్ తరలింపు పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అర్జీ-1 ఏరియా మేనేజర్ గోవిందారావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి , ఇతర అధికారులు పాల్గొన్నారు.
- August 25, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KARIMNAGAR
- LABOUR
- OFFICERS
- RAMAGUNDAM
- SINGHARENI
- ఉత్పత్తి
- కార్మికులు
- సింగరేణి
- Comments Off on కలిసికట్టుగా పనిచేద్దాం