నాని హీరోగా ‘టాక్సీవాలా’ మూవీ ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో సాగుతుందట. అందుకే సినిమాలో కలకత్తాను చూపించేందుకు ఫిల్మ్‌మేకర్స్ ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమా కథ ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా ఉంటుందని, అందుకోసం పాత కలకత్తా లుక్ కావాల్సి ఉందని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం కలకత్తా వెళ్లినా పాత లుక్ ఉండదు కావునా ఇక్కడే పాతతరం లుక్ వచ్చేలా అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో సెట్స్ వేస్తున్నారట.
ఇక ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం సాయి పల్లవిని తీసుకోబోతున్నారని, ఆమె రోల్ కీలకం అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఏదో కొత్త కంటెంట్ ఉందనే ఫీలింగ్ ను జనంలో మొదటి నుంచి బాగా క్రియేట్ చేస్తూ సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో వినూత్నంగా ఉంటుందంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకునే నాని.. మంచి కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటూ తన సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంటుందనే నమ్మకాన్ని మొదటి నుంచీ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. మరి ఈ కలకత్తా బ్యాక్‌డ్రాప్‌తో నాని అభిమానులకు ఎలాంటి ట్రీట్ అందించనున్నాడో వేచిచూడాలి.