కర్ణాటకలో మొదలైన డ్రగ్స్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ వ్యవహారం ముఖ్యంగా సినీ తారల మెడకు చుట్టుకుంటున్నది. ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ గురువారం సీసీబీ ఎదుట హాజరయ్యాడు. అతడు ఎవరెవరి పేర్లు చెప్పాడన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేది కి డ్రగ్స్ రాకేట్తో సంబంధాలు ఉన్నట్టు కన్నడ మీడియా వార్తలు వెలువరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజరైంది. మరోవైపు ఆమె నివాసముంటున్న అపార్ట్మెంట్లో శుక్రవారం సీసీబీ సోదాలు జరిపింది. ఈ సోదాల్లో కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. మరోవైపు మరోనటి సంజనకు కూడా డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికే సంజన బాయ్‌ఫ్రెండ్ రాహుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాహుల్ చెప్పిన వివరాల ఆధారంగా మరికొందరిని అరెస్ట్ చేయనున్నట్టు సమాచారం. అయితే తాజాగా సంజన మీడియాపై ఫైర్ అయ్యింది. ‘ మీడియా నన్ను ఎందుకు టార్గెట్ చేసిందో అర్థం కావడం లేదు. నేను ఏమన్నా టెర్రరిస్టునా. నిన్నటి నుంచి నన్ను ఓ ఉగ్రవాది కంటే ఎక్కువగా చూపిస్తున్నారు. రాహుల్‌ను ఎందుకు అరెస్ట్ చేశారో నాకు తెలియదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి’ అంటూ ఆమె విరుచుకుపడ్డారు. కాగా ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
- September 4, 2020
- Archive
- Top News
- జాతీయం
- ACTRESS
- DRUGS ROCKET
- KARNATKA
- MEDIA
- NAMES
- POLICE
- POLITICAL
- కర్ణాటక
- డ్రగ్స్‌రాకెట్
- హీరోయిన్లు
- Comments Off on కర్ణాటక డ్రగ్స్ రాకెట్లో సినీతారలు!