Breaking News

కరోనా వ్యాక్సిన్ పై విస్తృత అవగాహన

కరోనా వ్యాక్సిన్ పై విస్తృత అవగాహన

సారథి న్యూస్, హైదరాబాద్: కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు తయారుచేసిన వ్యాక్సిన్ సురక్షితమైందని, తీసుకునేందుకు వెనుకాడవద్దని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్​ రాజన్ అన్నారు. శనివారం నగరంలో కొనసాగుతున్న వ్యాక్సిన్ డ్రై రన్ లో భాగంగా గవర్నర్ దంపతులు హైదరాబాద్​ నగరంలోని తిలక్ నగర్ హెల్త్ సెంటర్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా తీసుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకొచ్చేలా కృషిచేయాలన్నారు. దేశంలో కరోనా నివారణకు భారత ప్రధాని నరేంద్రమోడీ తీసుకుంటున్న చొరవకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.