వాషింగ్టన్: ప్రపంచంలో ఏ దేశమైనా కరోనా వ్యాక్సిన్‌ను తయారుచేస్తే కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. “ మాకు మంచి జరుగుతుంది అంటే కచ్చితంగా వారితో కలిసి పనిచేస్తాం” అని ట్రంప్ అన్నారు. చైనాతో కలిసి పనిచేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్‌ను డెవలప్ చేసేందుకు అమెరికా కృషి చేస్తోందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని ట్రంప్ మొదటి నుంచి విమర్శలు చేశారు. ప్రతిఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని ట్రంప్ మరోసారి అన్నారు. గతంలో మాస్క్ పెట్టుకునేందుకు వ్యతిరేకత వ్యక్తం చేసిన ట్రంప్ ఈ మధ్యే మాస్క్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు మాస్క్‌పెట్టుకున్న ఫొటోలను కూడా ఆయన ట్వీట్ చేశారు.
- July 22, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- DONALDTRUMPH
- VACCINE
- అమెరికా
- కరోనా వ్యాక్సిన్
- డోనాల్డ్ ట్రంప్
- Comments Off on కరోనా వ్యాక్సిన్ కోసం దేశంతోనైనా పనిచేస్తాం