Breaking News

కరోనా మరణాల్లో భారత్​కు 7వ స్థానం

కరోనా మరణాల్లో భారత్​కు 7వ స్థానం

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 37,724 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 648 మంది చనిపోయారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 11,92,915కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 28,732 మంది చనిపోయారని కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. దీంతో ప్రస్తుత లెక్కల ప్రకారం మరణాల్లో మన దేశం స్పెయిన్‌ని దాటేసింది. 7వ స్థానంలోకి వెళ్లింది. ఇప్పటి వరకు 28,400 మరణాలతో 7వ స్థానంలో ఉన్న స్పెయిన్‌ 8వ స్థానానికి చేరినట్లు నిపుణులు చెప్పారు. కరోనా కేసుల సంఖ్యలో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసులు సంఖ్య ఇండియాలో వేగంగా పెరిగిపోతోంది. కేవలం జులై నెలలోనే ఆరు లక్షల కేసులు నమోదయ్యాయి. జూన్‌ నెలలో దాదాపు నాలుగు లక్షల కేసులు 11 వేల మరణాలు సంభవించాయి. అయితో జులైలో 22 రోజుల్లోనే 6లక్షల కేసులు నమోదు కాగా.. 11,000 మరణాలు నమోదయ్యాయి.