Breaking News

కరోనా.. బిల్లుల వసూలుపై కేటీఆర్​ ఫైర్​

కరోనా.. బిల్లుల వసూలుపై కేటీఆర్​ఫైర్​

సారథి న్యూస్, హైదరాబాద్: కోవిడ్ రోగాల నుంచి ఫిర్యాదులు ఎదుర్కొంటూ అధిక మొత్తంలో మెడికల్ బిల్లులు వసూలు చేస్తున్న ప్రైవేట్​ఆస్పత్రులపై కఠినచర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​కు మంత్రి కె.తారక రామారావు కోరారు. ప్రైవేట్​ఆస్పత్రి వల్ల తాను ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వివరిస్తూ మహేశ్వరం మండలం దుబ్బచెర్ల గ్రామానికి చెందిన అనురెడ్డి రాదేశ్​అనే యువకుడు గురువారం ట్విట్టర్ ద్వారా మంత్రికి ఫిర్యాదు చేశాడు.

‘కోవిడ్ – 19 కారణంగా నా తండ్రి, తల్లి, సోదరుడిని కోల్పోయాను. నా కుటుంబసభ్యులను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించాం. ముగ్గురికి కలిపి రూ.40లక్షలు చెల్లించాం. మిగతా బిల్లులు చెల్లించకపోతే నా తండ్రి మృతదేహాన్ని అప్పగించేది లేదు’ అన్నారని సదరు యువకుడు మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్​జరిగిన నష్టం గురించి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కష్టసమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడడం సరికాదన్నారు. ఇలాంటి సమస్యలు తీసుకోవాలని కోరారు.