బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన చోటుచేసుకున్నది. కరోనా నిర్ధారణ అయిన రోగుల ఇండ్లను మున్సిపల్ సిబ్బంది మెటల్‌తో సీలు చేశారు. బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న రెండు కుటుంబాలవారికి కరోనా సోకింది. దీంతో మున్సిపల్ సిబ్బంది వారి ఇండ్ల తలుపులకు ఇనుప రేకులను బిగించి వాటిని మేకులతో కొట్టి బిగించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర్ పాలిక) కమిషనర్ ముంజునాథ ప్రసాద్ క్షమాపణ చెప్పారు. ఇంటికి వేసిన సీల్‌ను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.
సూపర్