సారథి న్యూస్, రామాయంపేట/రామడుగు: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్ చేసింది. కరోనా వార్డుల్లో పనిచేసే సిబ్బందికి, డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇవ్వాలని కోరింది. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ దవాఖాన ఎదుట, కరీంనగర్ జిల్లా రామడగులోనూ బీజేపీ నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. కార్యక్రమంలో రామడుగు బీజేపీ మండల అధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి, రామయంపేట బీజేపీ మండల అధ్యక్షుడు శివరాములు, నాయకులు శంకర్ గౌడ్ , చంద్రశేఖర్, గణేష్, దిలీప్ కుమార్, నరేష్, శేఖర్ ,బాజా మల్లారెడ్డి శ్యాములు, చారీ తదితరులు పాల్గొన్నారు.
- June 22, 2020
- Archive
- లోకల్ న్యూస్
- CARONA
- RAMAYAMPET
- TELANGANA
- TESTS
- కరోనావార్డులు
- బీజేపీ
- Comments Off on కరోనా టెస్టులు పెంచండి