Breaking News

కరోనా.. జాగ్రత్తలు పాటించండి

కరోనా..జాగ్రత్తలు పాటించండి

సారథి న్యూస్, అచ్చంపేట: కరోనా వైరస్ విజృంభించకుండా కట్టడి చేయడంతో పాటు ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించి ప్రజలకు వివరించాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నియోజకవర్గ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. ఆదివారం ఆయన హైదరాబాద్ ​నుంచి జూమ్​యాప్ లో ఉప్పునుంతల ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవో, ఎస్సై, సర్పంచ్​లు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. కరోనా కాలంలో అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా చూడాలని కోరారు.